శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 21, 2021 , 00:27:16

కానరాని ప్రగతి జాడ

కానరాని ప్రగతి జాడ

  • తిమ్మారెడ్డిపల్లి తండాలో కొరవడిన పర్యవేక్షణ
  • ముందుకు సాగని అభివృద్ధి పనులు 
  • నిలిచిపోయిన సెగ్రిగేషన్‌ షెడ్డు నిర్మాణం
  • పిల్లర్లకే పరమితమైన వైకుంఠధామం
  • మంకీ ఫుడ్‌కోర్టులో ఎండిన మొక్కలు 
  • పట్టించుకోని సర్పంచ్‌, అధికారులు 

తిమ్మారెడ్డిపల్లి తండాలో ప్రగతి జాడలు కనిపించడం లేదు. సర్పంచ్‌, అధికారులు పట్టించుకోక పోవడంతో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్‌, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. సెగ్రిగేషన్‌ షెడ్డు పనులు నిలిచిపోగా.. వైకుంఠధామం పిల్లర్లకే పరిమితమైంది. 2 కి.మీ. దూరంలోని గుట్ట సమీపంలో 

మూడు నెలల కిందట మంకీ ఫుడ్‌ కోర్టులో నాటిన మొక్కలకు నీరందించకపోవడంతో ఎండిపోయాయి. నాటేందుకు తెప్పించిన మొక్కలు ఎక్కడికక్కడే వదిలేశారు. పంచాయతీ పాలకవర్గ ప్రమేయం లేకుండానే సర్పంచ్‌, అధికారులు అభివృద్ధి పనుల పేరిట పలుమార్లు ఎస్‌ఎఫ్‌సీ నిధులను డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఊట్కూర్‌, ఫిబ్రవరి 20 : నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో ప్రగతి జాడ కానరావడంలేదు. గతంలో నిడుగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తిమ్మారెడ్డిపల్లి చిన్న తండ, పెద్ద తండాను కలిపి రెండేండ్ల కిందట నూతన జీపీగా ఏర్పాటు చేశారు. అయితే. అధికారుల నిర్లక్ష్యంతో తండాలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. డంపింగ్‌ యార్డు, వైకుంఠ ధామం నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రెండింటినీ ఒ కే చోట చెరువు శిఖం భూమిలో నిర్మించడంతో వర్షం వస్తే భవనాల చుట్టూ నీరు చేరుతున్నది. ప్రభుత్వ స్థలం లేకపోవడంతో తండాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్ట వద్ద మంకీ ఫుడ్‌ కోర్టు ఏ ర్పాటు చేసి పండ్ల మొక్కలు నాటారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు సకాలంలో నీరందక మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణను గా లికి వదిలేశారు. వైకుంఠ ధామం, డంపింగ్‌ యార్డు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల పక్కన నాటేందుకు సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తెప్పించిన మొక్కలను ఎక్కడికక్కడే వృథాగా వదిలేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమేయం లేకుండానే సర్పంచ్‌, అధికారులు అభివృద్ధి పనుల పేరిట పలుమార్లు ఎస్‌ఎఫ్‌సీ నిధులను డ్రా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

చెరువు శిఖంలో నిర్మాణాలు..

పల్లెప్రగతిలో భాగంగా మంజూరు చేసిన నిధులతో తిమ్మారెడ్డిపల్లి తండాలో డంపింగ్‌ యార్డు, వైకుంఠ ధామం నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే నంబర్‌ 210, 211 చెరువు శిఖం భూ మిని సర్వే చేసి కేటాయించారు. ఆరు నెలల కిందట పనులను ప్రా రంభించగా.. భారీ వర్షాలకు నిర్మాణం చుట్టూ వర్షపు నీరు చేరింది. దీంతో అధికారులు పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. డంపింగ్‌ యార్డు, సెగ్రిగేషన్‌ షెడ్డు గోడలకు ప్లాస్టర్‌ చేయకుండా వదిలేశారు. వైకుంఠ ధామం గదుల నిర్మాణం, ముఖద్వారం పిల్లర్లకే పరిమితమైంది. పనులు పూర్తయినా ఎలాంటి ప్రయోజనం ఉండదని తండావాసులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ కమిటీ ప్రమేయం లేకుండా అభివృద్ధి పనుల పేరిట ఎస్‌ఎఫ్‌జీ నిధులు రూ. 3 లక్షలు డ్రా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు.

ప్రారంభంకాని పల్లె ప్రకృతి వనం..

తండాలో పల్లెప్రకృతి వనం నిర్మాణానికి అధికారు లు ఇంకా స్థలాన్ని కూడా గుర్తించలేదు. కలెక్టర్‌ హరిచందన ఆదేశాల మేరకు తండాకు రెండు కిలోమీటర్ల దూరంలో గుట్ట సమీపంలో మంకీఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేసి పండ్ల మొక్కలు నాటారు. మూడు నెలల కిందట నా టిన మొక్కలకు నీరందించకపోవడంతో ఎండిపోయాయి. 

స్థలం లేనందునే..

తండాలో ప్రభుత్వ స్థలం లేనందున చెరువు శిఖంలో డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక పనులను చేపట్టినం. భారీ వర్షాల కారణంగా చెరువు నిండింది. పనులు చేసేందుకు మేస్త్రీ సహకరించడం లేదు. కొద్ది రోజుల్లో పనులను ప్రారంభించి డంపింగ్‌ యార్డు, శ్మశానవాటికను పూర్తి చేయిస్తా. కొందరు గిట్టకనే నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్నారు.

- చౌహాన్‌ దేవమ్మ, సర్పంచ్‌, తిమ్మారెడ్డిపల్లితండా

ఇబ్బందులు పడుతున్నాం..

ప్రభుత్వం నిధులు మంజూరు చే స్తున్నా.. అధికారులు, సర్పంచ్‌ పట్టించుకోవడం లేదు. సామూహిక మరుగుదొడ్లు మంజూరైనా ఇంత వరకు కట్టలే దు. మహిళలు ఇబ్బంది పడాల్సివస్తున్న ది. మురుగు కాల్వలు శుభ్రం చేయించ డం లేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంటున్నది. తండాలో పారిశుధ్యం లోపించింది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.       - ధన్‌రాజ్‌నాయక్‌, తిమ్మారెడ్డిపల్లి తండా


VIDEOS

logo