శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 20, 2021 , 00:29:09

వసతి గృహాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

వసతి గృహాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

నారాయణపేట, ఫిబ్రవరి 19 : ఎస్సీ విద్యార్థుల వసతి గృహా ల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని (ఆనంద నిలయం) శు క్రవారం ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జైపాల్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థులు వినియోగించే బాత్‌ రూంలు, తాగునీటి వ సతి, విద్యుత్‌ సౌకర్యం, భవన మరమ్మతులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పలు రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్‌డ బ్ల్యూ కన్యాకుమారి, వార్డెన్‌ మధులత ఉన్నారు. 

బాలికల వసతి గృహం తనిఖీ

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 19 : పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణమాచారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని పరిసరాలను, విద్యార్థులకు వండిన పదార్థాలను, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వసతి గృహ సంక్షేమ అధికారి రేణుకను ఆదేశించారు. 

విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి

ధన్వాడ, ఫిబ్రవరి 19 : విద్యార్థులు కష్టపడి చదువుకొని ముందుకుపోవాలని సోషల్‌ వెల్ఫేర్‌ అదనపు డైరెక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. మండల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఏఎస్‌డబ్ల్యూ కన్యాకుమారితో కలిసి అదనపు డైరెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ నిబంధనలతో హాస్టల్‌ నిర్వహణ చేపట్టాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్‌తోపాటు పలు అంశాలపై వార్డెన్‌ విజయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక వసతులు సమకూర్చుతుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం హాస్టల్‌ ఆవరణలో మొక్కలు నాటారు. 


VIDEOS

logo