Narayanpet
- Feb 18, 2021 , 00:45:39
VIDEOS
చెట్ల నరికివేతతో మానవ మనుగడకు ముప్పు

నారాయణపేట, ఫిబ్రవరి 17:చెట్ల నరికివేత వలన వాతావరణ సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మెర్సీ వసంత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెట్ల నరికివేతతో కాలుష్యం పెరిగిపోయి మానవ కోటికి నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు లక్ష్మణాచారి, భాస్కర్ రెడ్డి, సంధ్యారాణి, అధ్యాపకులు డాక్టర్ సత్యభాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి, సిబ్బంది సత్యనారాయణ, విశ్వనాథ్, రాము, వెంకటయ్య, హన్మంత్‌రావు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING