భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ బండారు ఉత్సవాలు

మరికల్, ఫిబ్రవరి 17: ప్రతి ఐదు సంవత్సరాలకోసారి జరుపుకొనే ఎల్లమ్మ బండారు ఉత్సవాలను బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కురుమయాదవులు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఇతర ప్రాంతాలనుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఎల్లమ్మా చల్లగా చుడామ్మా.. అంటూ తమ ఒంటిపై పసుపు చల్లుకుంటారు. వేడుకలు చూ సేందుకు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని ఇతరులపై బండారు వేస్తారు. ముందుగా బైండ్లవారితో పుటం కట్టించి ఎల్లమ్మను ఉరేగిస్తారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా నిర్వహించే బండారు ఉత్సవాలకు బైండ్లవారు ముగ్గులతో పుటాన్నివేసి ముందు ఎల్లమ్మకు నైవేద్యంగా కల్లును ఉంచి, తమ పాటలతో పుటంఎదుట మేకపిల్లని నిద్రపుచ్చి ఎల్లమ్మ కథను చెబుతారు. అనంతరం మేకను నిద్రలోనుంచి లేపి ఎల్లమ్మకు బలిఇచ్చి పూజా కార్యక్రమాలను ముగించిన వెంటనే పసుపు చల్లుకొని ఉత్సవాలను నిర్వహిస్తారు. బుధవారం నిర్వహించిన ఉత్సవాల్లో చిత్తనూర్ వంశస్థులు బండారును చల్లుకున్నారు. ఈ వారంలో ఇదే వంశస్థులు బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
తాజావార్తలు
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత