ప్రణాళికతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

తెలకపల్లి, ఫిబ్రవరి 15: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతి అన్నారు. మండలంలోని పెద్దపల్లి జిల్లా పరిషత్ పా ఠశాలలో సోమవారం క్లాస్మే ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఐఐఐటీ, అగ్రికల్చర్ డిప్లొమాకు ఎంపికైన విద్యార్థులకు జరిగిన సన్మా న కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డుకాదన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదువాలని సూ చించారు.ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏ ప్రాంతమైనా మానవ వనరులు అభివృద్ధ్ది చెందినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు వారి కృషి, పట్టుదల వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఐఐఐటీకి ఎంపికైన స్వాతి, రాజేశ్వరి, అగ్రికల్చర్ డిప్లొమాకు ఎంపికైన బాలును శాలువాతో సన్మానించారు. ఈ విద్యార్థులకు క్లాస్మేట్ క్లబ్ తరఫున రెండువేల చొప్పున నగదు బహుమతిని అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనసూయమ్మ, మాజీ ఎంపీటీసీ బంగారయ్య, ఉప సర్పంచ్ జయరాం, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్, క్లాస్మేట్క్లబ్ నిర్వాహకులు రాఘవేందర్, శ్రీనివాసులు, బాలరాజు పాల్గొన్నారు.