మంగళవారం 09 మార్చి 2021
Narayanpet - Feb 16, 2021 , 00:26:19

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

 టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

  • గ్రామాల్లో ముమ్మరంగా పార్టీ సభ్యత్వ నమోదు

 బిజినేపల్లి, ఫిబ్రవరి 15 : టీఆర్‌ఎస్‌ ద్వారా నే అభివృద్ధి సాధ్యమవుతుందని జెడ్పీటీసీ హరిచరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అల్లీపూర్‌, మమ్మాయిపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు తరచూ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలపై, ప్రభుత్వంపై దాడులు, విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున్‌, రాజశేఖర్‌, రమణగౌడ్‌, కృష్ణ, లక్ష్మయ్య, శ్రీను, తదితరులు ఉన్నారు. 

గడ్డంపల్లిలో..

తెలకపల్లి, ఫిబ్రవరి 15: తెలకపల్లి మండ లం గడ్డంపల్లిలో సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీపీ మధు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం కావడానికి సభ్యత్వ నమోదు దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదరణ మరింత పెరిగిందన్నారు. సాగునీరు, రైతుబంధు,పల్లె ప్రగతి తదితర పథకాలు జనానికి ఎంతో మేలు చేకూర్చాయని వలసలు లేకుండాపోయాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారన్నారు. పల్లె ప్రాంతానికి మరింత అభివృద్ధి వెలుగులు తెలంగాణ ప్రభుత్వం చేకూరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతోపాటు సర్పంచ్‌ లక్ష్మయ్య, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాడూరు మండలంలో

తాడూరు, ఫిబ్రవరి 15 : మండలంలోని యత్మతాపూర్‌ గ్రామంలో సోమవారం  స్థానిక ఎంపీటీసీ సభ్యులు, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికెళ్లి సభ్యత్వ పార్టీ సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో టార్గెట్‌ను పూర్తి చేస్తానన్నారు. కార్యక్రమంలో జే కృష్ణారెడ్డి, మణిపాల్‌రెడ్డి, రఘుమారెడ్డి, నాగిరెడ్డి, చంద్రమౌళిగౌడ్‌, సంతోష్‌రెడ్డి, నిరంజన్‌, పర్వతాలు, నాగయ్యగౌడ్‌, వెంకటయ్యతోపాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిమ్మాజిపేటలో

తిమ్మాజిపేట, ఫిబ్రవరి 15 : మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు చురుగ్గా కొనసాగుతుంది. సోమవారం ఆవంచ, అప్పాజిపల్లి, ఆర్సీతండాలో పార్టీ ఇన్‌చార్జిలు సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలో ఇంతవరకు 4 వేల సభ్యత్వాలు పూర్తి అయినట్లు పార్టీ మండల అధ్యక్షుడు స్వామి తెలిపారు. మండలంలో పదివేల సభ్యత్వాలను పూర్తిచేస్తామని తెలిపారు.

VIDEOS

logo