ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Feb 14, 2021 , 00:56:54

హెల్మెట్‌ ధరించడాన్ని బాధ్యతగా భావించాలి

హెల్మెట్‌ ధరించడాన్ని బాధ్యతగా భావించాలి

నారాయణపేట, ఫిబ్రవరి 13 : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడాన్ని బరువుగా కాకుండా బాధ్యత గా భావించాలని డీఎస్పీ మధుసూదన్‌రావు అన్నారు. పట్టణంలోని అంబేద్క ర్‌ చౌరస్తా నుంచి ప్రధాన రహదారి గుండా హెల్మెట్‌ వినియోగంపై 32వ జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో భాగం గా శనివారం నిర్వహించిన బైక్‌ ర్యాలీ కి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తరచుగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాల న్నారు. త్రిబుల్‌ రైడింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయరాదన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై నాసర్‌, ఆర్‌ఐ కృష్ణయ్య, ఆర్‌ఎస్సై నరసింహా, సిబ్బంది, స్పెషల్‌ పోలీసులు పాల్గొన్నారు. 

VIDEOS

logo