గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 14, 2021 , 00:56:54

ఎన్నికల కోడ్‌ పాటించాలి

ఎన్నికల కోడ్‌ పాటించాలి

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 13 : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్‌ పాటించాల ని జిల్లా సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. వచ్చే నెలలో జరుగనున్న హైదరాబాద్‌, రం గారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై శనివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. సమావేశంలో బీజేపీ నాయకుడు నందూనామాజీ, టీఆర్‌ఎస్‌ నాయకులు శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, విద్యాసాగర్‌, టీడీపీ నాయకుడు వినయ్‌మిత్ర యాదవ్‌, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.   

VIDEOS

logo