గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 13, 2021 , 02:07:24

టీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

  • రికార్డు స్థాయిలో సభ్యత్వాలు 
  • కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి, ఫిబ్రవరి 12 : టీఆర్‌ఎస్‌ హయాంలోనే కొడంగల్‌ నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని  ఏబీకే ఫంక్షన్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో సోషల్‌ మీడియా కీలకమైందని, దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నిమిషాల్లో ప్రజలకు చేరుతుందంటే సోషల్‌ మీడియానే ప్రధాన కారణమన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభించాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు ఇవ్వడంతోపాటు, ఇన్సురెన్స్‌ సౌక ర్యం కల్పిస్తామని తెలిపారు. అంతకుముందు మున్సిపాలిటీలో చే పట్టిన మార్కెట్‌ షెడ్ల ఏర్పాటు, సీసీరోడ్డు, మున్సిపల్‌ భవన నిర్మా ణం, శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ జగన్మోహన్‌, జెడ్పీటీసీ ప్ర కాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, కౌన్సిలర్లు, నియోజకవర్గ స్థా యి ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.


VIDEOS

logo