సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Feb 12, 2021 , 00:41:33

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి

ఊట్కూర్‌, ఫిబ్రవరి11 : జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే పలు పనులతో గ్రామాలను మరిం త అభివృద్ధి చేసుకోవాలని స్టేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ మురళి అన్నారు. మండలంలో ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన పలు అభివృ ద్ధి పనులను గురువారం తనిఖీ చేశారు. డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక, పార్కు నిర్మాణం, హరితహారంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాయంలో సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో మురళిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఏపీడీ సందీప్‌, ఏపీవో ఎల్లప్ప, ఈసీ శ్రీనివాసులు, టీఏలు నాగరాజు, హర్షవర్ధన్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo