గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 11, 2021 , 00:17:03

రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి

రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి

  • వాలీబాల్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 10: రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నీలో జిల్లా జట్లు విజేతగా నిలవాలని వాలీబాల్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లా సీనియర్‌ వాలీబాల్‌ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను శాంతికుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేటలో ఈ నెల 18నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్‌ వాలీబాల్‌ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీలో సమిష్టిగా ఆడి విజయం సాధించాలని ఆకాంక్షించారు.  ప్రతిభగల వాలీబాల్‌ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో వాలీబాల్‌ సంఘం జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి చెన్నవీరయ్య, విద్యాధర్‌, బాలస్వామి, బషిరుద్దీన్‌, పర్వేజ్‌షాష, ఇర్ఫత్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిద్దిపేట టోర్నీకి ఎంపికైన జట్లు

పురుషుల జట్టు : యశ్వంత్‌కుమార్‌, సందీప్‌, మేరాజుద్దీన్‌, సమీర్‌, భాగ్యరాజ్‌, ఫారుఖ్‌, మణికంఠ,జైసింహ, సోహైల్‌, గులాం ఫర్హాన్‌ఖాన్‌, నరేందర్‌, మునవర్‌ హుస్సేన్‌.

మహిళ జట్టు  

జ్యోతి, కవిత, సౌమ్య, అనిత, రాణి, సునీత, నందినిరెడ్డి, యాదమ్మ, లింగమ్మ, షారోన్‌, మానస, మౌనిక, స్టాండ్‌బైగా హర్షిత్‌, పల్లవి. 

VIDEOS

logo