శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 11, 2021 , 00:17:06

సేవలో యువత

సేవలో యువత

  • పేదలకు సాయం చేస్తున్న ‘మన సేవా సమితి’
  • వివేకానంద సూక్తుల స్ఫూర్తిగా కొనసాగింపు
  • ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకం
  • సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభ్యులు

జడ్చర్ల టౌన్‌, ఫిబ్రవరి 10 : పెద్దగా ఆస్తిపాస్తు లు లేకున్నా.. చిరు ఉద్యోగం, వ్యాపారాలు చేస్తున్న యువకులు సంపాదించిన డబ్బులో కొంత సామాజిక సేవకు ఖర్చు చేస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘శక్తి అనేది డబ్బు లో లేదు.. మంచితనం, పవిత్రతలో ఉంది’ అం టూ స్వామి వివేకానంద చెప్పిన సూక్తిని స్ఫూరిగా తీసుకున్నారు. జడ్చర్లకు చెందిన వేణుగోపాలాచా రి, రవీందర్‌రెడ్డి, రాఘవేందర్‌, విజయ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, శశాంక్‌, యాదగిరి, గోనెల రాధాకృష్ణ, విజేందర్‌రెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్‌ సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నా రు. వీరిలో కొందరు ప్రైవేట్‌ ఉద్యోగులు, మరికొందరు చిరువ్యాపారులు. 2012లో మన సేవా స మితి సంస్థను ఏర్పాటు చేసి సమాజ సేవలో తమ వంతుగా సాయం అందిస్తున్నారు. సభ్యులందరూ డబ్బులు జమచేసి సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. పేద విద్యార్థులకు నోటుబుక్కులు, బెల్టు లు, సబ్బులు, సర్పు ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. పేదల నివాస ప్రాంతాల్లో వైద్యశిబిరాలు, సామాజిక కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ, బాటసారులకు అన్నదాన కార్యక్రమాలు, ఇంటింటికీ తిరిగి మాస్కుల పంపిణీ చేపట్టారు. 

నెహ్రూ యువ కేంద్రం సహకారంతో మహిళలకు కుట్టుశిక్షణ ఇచ్చారు. ఎయిడ్స్‌, కరోనా తదితర వ్యాధులపై అవగాహన ర్యాలీ, హెల్మెట్‌ ధరించడం వంటి వాటిపై అవగాహన సదస్సులు ఏర్పా టు చేస్తున్నారు. జాతీయ నాయకుల దినోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్నారు. పండుగల సమయంలో పేదలకు పచ్చడి, భక్షాలు అందజేస్తున్నారు. కళాకారులను సన్మానిస్తున్నా రు. మన సేవా సమితి సంస్థ చేస్తున్న సేవలను గుర్తించిన గుంటూర్‌ జిల్లాకు చెందిన జయ సాయి ట్రస్టు.. దత్తసాయి జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసింది. 

మా వంతుగా సేవలందిస్తున్నాం..

తమ వంతుగా పేదలకు సాయం అందించాల న్న ఆలోచనతో 2012లో మన సేవా సమితి సం స్థను ఏర్పాటు చేసుకున్నాం. సామాజిక కార్యక్ర మం నిర్వహించేందుకుగానూ సభ్యులందరం కలి సి విరాళాలు వేసుకుంటాం. కొన్నిసార్లు దాతల స హకారాన్ని కూడా తీసుకుంటాం. తమ ఆర్థిక స్థా యి మేరకు సేవలందిస్తున్నాం. పేదలకు సాయం చేస్తున్నామన్న తృప్తి మిగులుతుంది. 

- వేణుగోపాలాచారి, మనసేవా సమితి అధ్యక్షుడు 

వివేకానంద సూక్తులే స్ఫూర్తి..

వివేకానంద స్వామి సూక్తుల స్ఫూర్తిగా సభ్యులందరం కలిసి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం. ఆర్థిక స్థితిగతులను బట్టి విరాళాలు వేసుకుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులను ప్రోత్సహిస్తున్నాం. శ్రమదానం, మొక్క లు నాటడం వంటి కార్యక్రమాలతోపాటు ప్రజల కు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు అందజేస్తున్నాం. 

- గోనెల రాధాకృష్ణ, సాంస్కృతిక కార్యదర్శి


VIDEOS

తాజావార్తలు


logo