మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Feb 08, 2021 , 00:21:07

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఊట్కూర్‌, ఫిబ్రవరి 7 : మండలంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల 19 99లో పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  20 ఏండ్లు గడిచిపోవడంతో ఆదివారం మండల శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పూర్వ విద్యార్థులు కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తప స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఫైర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ నరేశ్‌గౌడ్‌, వీఆర్‌ఏ రాజప్ప, వెంకటేశ్‌గౌడ్‌, శ్రీనివాసులు, నర్సింహాలు తదితరులుపాల్గొన్నారు.


VIDEOS

logo