సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Feb 07, 2021 , 01:28:48

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వ్యవసాయ రంగానికి పెద్దపీట

పానగల్‌, ఫిబ్రవరి 6 : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి పెద్ద వేసిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కి ష్టాపూర్‌, రేమద్దుల గ్రామాల్లో డీ-8, మేజర్‌ 4,మేజర్‌ 6 కా లువల ద్వారా రైతుల పంటలకు సాగునీరు అందడంలేదనే విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే ఇరిగేషన్‌ అధికారులతో కలి సి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, ఇరిగేషన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంపది రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అం దేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్‌ ఈఈ మధుసూన్‌రావు, డీఈ ఎల్లస్వామి, వెంకటరమణాదేవి, ఏఈలు వెంకటయ్య, వెంకటేశ్‌, గిరిధర్‌రావు, ఎంపీటీసీలు మిద్దె కృష్ణయ్య, సుబ్బయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాముయాదవ్‌, చంద్రశేఖర్‌నాయక్‌, వెంకటయ్యనాయుడు, వీరసాగర్‌, యాదగిరిచారి రైతులు ఉన్నారు.

VIDEOS

logo