శనివారం 06 మార్చి 2021
Narayanpet - Feb 07, 2021 , 01:28:48

ప్రజలకు నమ్మకం కలిగించాలి

ప్రజలకు నమ్మకం కలిగించాలి

నారాయణపేట, ఫిబ్రవరి 6 : పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగడానికి తమవంతు పాత్రను పోషించాలని ఎస్‌హెచ్‌వోలు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల్లో పోలీస్‌ సిబ్బంది, కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వోలు మాట్లాడుతూ వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారందరూ సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కోర్టు డ్యూటీ అధికారులు కోర్టు ప్రాసిక్యూటర్‌, సి బ్బందితో సమన్వయాన్ని కొనసాగించాలన్నారు. కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవం తంగా వ్యవహరిస్తూ నిందితులకు సరైన రీతిలో శిక్షలు పడేలా చేసి సకాలంలో బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసు దర్యాప్తు, విచారణలో సమర్థవంతంగా ఇన్వెస్టిగేషన్‌, ప్రాసిక్యూషన్‌ చేయాలన్నారు. కోర్టుల్లోని వివిధ అధికారులను సమన్వయపరుస్తూ సాక్షులు, నిందితులను కోర్టులో హాజరు పరచాలన్నారు. వారంలో కోర్టుల్లో జరిగిన కేసు ల్లో పడిన శిక్షలు, వీగిపోయిన కేసుల లోపాలను చర్చించారు. 


VIDEOS

logo