గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 06, 2021 , 00:26:34

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

  • కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి, ఫిబ్రవరి 5 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే కొడంగల్‌ అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం పనులు చేయిస్తున్నామని కొడంగల్‌ ఎ మ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మద్దూర్‌ మండలంలోని నందిగామ, నందిగామ తండా నుంచి వాల్యా నాయక్‌ తండా వరకు నూతనంగా బీటీ రోడ్డు వేసేందుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మూడున్నర కిలో మీటర్ల మేరకు రూ. నాలు గు కోట్ల ఇరవై లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణం పనులు చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా కష్ట కాలంలో సైతం ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి పనిని కూడా నిలిపి వేయలేదన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కడ ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, తణక్షమే పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


VIDEOS

logo