సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Feb 06, 2021 , 00:26:54

లక్ష్యం పూర్తి చేయాలి

లక్ష్యం పూర్తి చేయాలి

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 5 : పీఎంఈజీపీ పథకం ద్వారా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిచందన బ్యాంకు కో ఆర్టినేటర్లను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు టీఎస్‌ ఐపాస్‌ కింద 106 దరఖాస్తులు వచ్చాయని, అం దులో 93 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామన్నారు. టీ ఫ్రైడ్‌ పథకం ద్వారా వాహనాల కోసం 25 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో ఎస్సీల నుంచి 16, ఎస్టీ ల నుంచి 6, దివ్యాంగుల నుంచి 3 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. మహిళలకు 45 శాతం సబ్సిడీ, పురుషులకు 35 శాతం సబ్సిడీ కింద మంజూరు చేశామన్నారు. సీనియారిటీ ప్రకారం సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ రామసుబ్బారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎల్‌డీఎం ట్రాన్స్‌కో, ట్రాన్స్‌పోర్ట్‌, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌, గ్రౌండ్‌ వాటర్‌, ఫైర్‌, కమర్షియల్‌, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo