శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 05, 2021 , 00:31:35

సంతలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

సంతలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  • మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

నర్వ, ఫిబ్రవరి 4 : అన్ని గ్రామాల్లో సంతలను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కల్వాల గ్రామంలో సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వి.మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సం తను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ప్రతి గురువారం గ్రామంలో జరిగే సంతలో వ్యాపారులు తాజా కూరగాయలు, నాణ్యవంతమైన సరుకులను విక్రయించి వినియోగదారుల అభిమానం పొందాలని సూచించారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామం లో వారాంతపు సంతను ప్రారంభించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంత రం గ్రామంలో ఏర్పాటు చేసిన సందెపురాళ్ల పోటీలో ఎమ్మెల్యే స్వయంగా రాయిని ఎత్తి పోటీలను ప్రారంభించారు. సంత ఏర్పాటు కోసం కృషి చూపిన సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ మం డలాధ్యక్షుడికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విండో వైస్‌ చైర్మన్‌ లక్ష్మణ్‌, ఉపసర్పంచ్‌ అంపన్న, కో ఆప్షన్‌ స భ్యుడు అలీ, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బీటీ రోడ్డు కోసం వినతి

జక్కన్నపల్లి గ్రామానికి మండలం నుంచి బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు రామన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జక్కన్నపల్లి యువకులు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే అవసరమైన అన్ని గ్రామాల్లో బీటీ రోడ్లు వేయిస్తాన ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

VIDEOS

logo