గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 05, 2021 , 00:31:37

జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదాం

జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదాం

  • నారాయణపేట కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 4 :  అధికారులందరూ సమన్వయం తో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామని నారా యణపేట కలెక్టర్‌ హరిచందన అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో కూడా అధికారులందరూ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, ఏవో ఖలీద్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo