సంతలతో గ్రామాలకు పూర్వ వైభవం

- ఊట్కూర్‌లో సంత బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టెం
ఊట్కూర్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంత బజార్లను ఏర్పాటు చేసి గ్రామాలకు పూర్వ వైభవం తేవాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఊట్కూర్ మండల కేంద్రంలో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతబజార్ను ఎమ్మెల్యే చిట్టెం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి బుధవారం గ్రామంలో జరిగే సంతలో వ్యాపారులు తాజా కూరగాయలు, నాణ్యవంతమైన సరుకులను విక్రయించి వినియోగదారుల అభిమానం పొందాలని సూచించారు.
కూరగాయలను విక్రయించిన ఎమ్మెల్యే ..
మండల కేంద్రంలో సంత బజార్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఓ దుకాణం వద్ద ఎమ్మెల్యే స్వయంగా కూరగాయలను తూకం వేసి విక్రయించారు. పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేకు డబ్బులు చెల్లించి కూరగాయలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌గుప్త, తాసిల్దార్ తిరుపతయ్య, ఎస్సై రవి, ఉప సర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, పంచాయతీ కార్యదర్శి జాన్, వార్డు సభ్యులు ఇస్మాయిల్, హేమలత, లక్ష్మి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కు పంపిణీ
మక్తల్‌రూరల్, ఫిబ్రవరి 3: సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 60 వేల చెక్కును ఎమ్మెల్యే చిట్టెం అందచేశారు.కార్యక్రమంలో టీఆర్ఎస్నర్వ మండల కమిటీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, మక్తల్ మండల ప్రధాన కార్యదర్శి కావలి తాయప్ప తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం