గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 04, 2021 , 00:32:19

ఎస్పీ బాలు సమాధి వద్ద నివాళి

ఎస్పీ బాలు సమాధి వద్ద నివాళి

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 3: చెన్నై తామరపాకంలోని ఎస్పీ బాలు ఫాం హౌస్‌ను బుధవా రం నారాయణపేటకు చెందిన ఎస్పీ బాలు అభిమానసంఘం నాయకులు సందర్శించారు. ఎస్పీ బాలు సమాధి వద్ద పూలమాల ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల వలన బాలు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయామన్నారు. ఆయన మరణం దేశంలోని కళాకారులకు తీరని లోటని తెలిపారు. పేట జిల్లా కేంద్రంలో బాలు కళాభవనం త్వరలో పూర్తి చేసి ఆయన పేరిట చిన్నారులకు శాస్త్రీయ నృత్య సంగీతం నేర్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు రామకృష్ణ కళ్యాణి, వసంత్‌కుమార్‌, శ్రీనివాస్‌, కుమార్‌  పాల్గొన్నారు.  

VIDEOS

logo