బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Feb 03, 2021 , 01:35:39

జిల్లాలో 535 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

జిల్లాలో 535 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

  • ఖాళీల లెక్క తేల్చడంతో నిరుద్యోగుల్లో పెరిగిన ఆశలు
  • పదోన్నతులు కల్పిస్తే పెరగనున్న ఖాళీలు 

కందనూలు, జనవరి 4: ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాలు వేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ విద్యార్థులకు కళాశాలల్లో పోలీస్‌ నియామకాలకు ఉచితంగా ట్రైనింగ్‌, కోచింగ్‌ ఇచ్చి సన్నద్ధులను చేస్తున్నది. అదే తరహాలో మిగతా వారు కూడా తమకు నచ్చిన శాఖలో ఉద్యోగం సాధించేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

పెరిగిన ఆసక్తి..

రాష్ట్ర ప్రభుత్వం ఏఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో నివేదించాలని జిల్లాస్థాయి అధికారులకు ఆదేశించింది. ఆయా శాఖాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను అధికారులు చెప్పడంతో నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. 

535 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3,709 మంది ఉపాధ్యాయులకుగానూ 3,174 మంది పని చేస్తున్నారు. మిగిలిన 535 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సంఖ్యను డీఈవో ప్రభుత్వానికి తాజాగా నివేదించడంతో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అంటున్నారు.

ఖాళీల వివరాలిలా..

జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 535 మంది ఉపాధ్యాయ పోస్టుల్లో.. జీహెచ్‌ఎం(గ్రేడ్‌-2)-53, ఎల్‌ఎఫ్‌ హెచ్‌ఎం-50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు డీఈవో వెల్లడించారు. ఇంకా 432 పోస్టులు ఖాళీగా ఉండగా అందులో.. ఎస్‌ఏ

లో మ్యాథ్స్‌ -16, ఫిజికల్‌ సైన్స్‌-9, బయోసైన్స్‌-42, సోషల్‌-69, ఆంగ్లం-16, తెలుగు-8, హిందీ-18, ఉర్దూ-5, సంస్కృతం-1, పీఈటీ-1, పీడీ-4, ఎస్‌జీటీ-216, లాంగ్వేజ్‌ పండింట్‌ తెలుగు-10, ఎల్‌పీ హిందీ-14, ఎల్‌పీ ఉర్దూ-3, ఎల్‌పీ సంస్కృతం-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇదే మంచి అవకాశం..

చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ  చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమైతే మంచిది. 

-డీఈవో గోవిందరాజులు


VIDEOS

logo