శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 03, 2021 , 01:35:36

వ్యవసాయంతో అద్భుతాలు

వ్యవసాయంతో అద్భుతాలు

  • పంటల మార్పిడితోనే అధిక దిగుబడులు   
  • ఖిల్లాఘణపురం మండలంలో రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి  నిరంజన్‌రెడ్డి

ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 2 : అద్భుతాలు సృష్టించగల ఏకైక రంగం వ్యవసాయమేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఖిల్లాఘణపు రం, సోలీపూర్‌, మానాజీపేట, కమాలొద్దీన్‌పూర్‌, అప్పారెడ్డిపల్లి, మామిడిమాడ, పర్వతాపూర్‌ క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానాజీపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. రైతులు ఆధునిక వ్యవసాయం ది శగా అడుగులు వేయాలన్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి డిమాండ్‌ ఉన్న వాటిని సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలన్నా రు. మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినప్పుడే ఆర్థికంగా ఎదుగుతారన్నా రు. వ్యవసాయ అధికారులు నూతన సాగువిధానాలపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రైతువేదికలు ఉపయోగపడతాయన్నారు. రా ష్ట్రంలో ఎక్కడైతే సాగు విధానం బాగుందో.. దానిని రైతువేదికల్లో ప్రొజెక్టర్లను ఏర్పాటు చే సి రైతులకు అధికారులతో అవగాహన కల్పిస్తామన్నారు. వరి, వేరుశనగ, పత్తి, కందులు, జొన్న, మొక్కజొన్న తదితర పంటలే కాకుం డా ఆధునిక వ్యవసాయంపై రైతులు మక్కువ చూపించాలన్నారు. ఇతర రాష్ర్టాల్లో సాగుచేసే పంటలపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గం నుంచి రైతులను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నదాతల కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌, ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ మదిలో నుంచి వచ్చిన రైతువేదికలు మున్ముందు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తాయన్నారు. వరి సాగులో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రైతులు రెండు, మూడెకరాల్లో మల్బరీ పంట ను సాగుచేసి అధిక లాభాలు సాధిస్తున్నారన్నారు. కూరగాయలు, పండ్లు, ఉద్యాన పం టల సాగుపై దృషి సారించాలన్నారు. అనంత రం మానాజీపేట గ్రామంలో సీఎం సహాయనిధి నుంచి మంజురైన చెక్కులను బాధితుల కు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కృష్ణానాయక్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట్రావు, కార్మిక సంఘం జి ల్లా అధ్యక్షుడు విక్రమ్‌, వనపర్తి మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, రాజు, బాలీశ్వర్‌రెడ్డి, సత్యం, పురుషోత్తం, సురేందర్‌, రాంచంద్రయ్య, జా త్రునాయక్‌, వెంకటేశ్‌, శ్రీను, బాల్‌రెడ్డి, సా యిలు, సురేందర్‌, కరీం, జాత్రునాయక్‌, స ర్పంచులు వెంకటరమణ, పద్మ శ్రీ, ఉమ, గో పాల్‌జీ, కృష్ణవేణి, నిర్మల, సతీశ్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo