శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 31, 2021 , 00:12:11

నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతా..

నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతా..

  • కృష్ణ మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
  • సతీమణితో కలిసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు  
  • వేలాదిగా హాజరైన టీఆర్‌ఎస్‌ నాయకులు

మక్తల్‌ టౌన్‌, జనవరి 30 : నియోజకవర్గ అభివృద్ధికి ఎ ల్లవేళలా పాటుపడుతానని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మక్తల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే ని వాసంలో, చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌, మార్కె ట్‌ కమిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిట్టెం తన సతీమణి, రైతుబంధు సమితి సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డితో కలిసి మక్తల్‌ పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ రాజేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌ వద్ద జరిగిన వేడుకలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, డీసీసీబీ చైర్మన్‌ ని జాంపాషా హాజరై ఎమ్మెల్యేను సన్మానించారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉందన్నారు. కృష్ణ మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భూమి ఉందని, సీఎం కేసీఆర్‌ను పిలిపించుకొని పనులు ప్రారంభించుకుందామన్నారు. రాజేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వెంటే ఉన్నారన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేను సీఐ శంకర్‌, ఎస్సై రాములు, మున్సిపల్‌ ఏఈ నాగశివ, మా ర్కెట్‌ సెక్రటరీ భారతి సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, ఎంపీపీ వనజ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అనిల్‌, అథ్లెటిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహగౌడ్‌, మాగనూర్‌ జెడ్పీటీసీ వెంకటయ్య, సర్పంచ్‌ సుదర్శన్‌గౌడ్‌, పార్టీ అధికార ప్రతినిధి రామలింగం, డైరెక్టర్లు రాజమహేందర్‌రెడ్డి, శాలం, శంషోద్దీన్‌, అశోక్‌, పద్మమ్మ, కౌన్సిలర్లు మొగిలప్ప, రాములు, శ్వేత, నాయకులు సోంభూపాల్‌గౌడ్‌, బుడ్డప్ప, సంతోష్‌, తాయప్ప, చంద్రకాంత్‌గౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, నర్సింహ, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo