శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 30, 2021 , 00:27:52

పల్లెకు ప్రకృతి శోభ

పల్లెకు ప్రకృతి శోభ

  • వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు   
  • ఆట వస్త్తువులతో చిన్నారుల ఆటపాటలు

మరికల్‌, జనవరి 29 : యువకులు, వృద్ధ్దులు, మహిళ లు ఉదయం, సాయంత్రం రోడ్ల వెంబడి వాకింగ్‌ చేస్తున్నారు. ఇకపై రహదారిపై వాకింగ్‌ చేయవలసిన పనిలేకుం డా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వ నాలను ఏర్పాటు చేసిన్నది. ఈ వనంలో పచ్చని చెట్లు, పూ ల మొక్కల మధ్య పరుగులు తీయడానికి వాకింగ్‌ ట్రాక్‌ల ను ఏర్పాటు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో 4 వేల వివి ధ రకాల మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పచ్చదనంతో గ్రామాలు కళకళాడుతున్నాయి. 

ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు...

యువత దేహదారుఢ్యం కోసం పట్టణల్లో జిమ్‌లకు వె ళ్తారు, పల్లెల్లో జిమ్‌లు లేకపోవడంతో నిరాశతో ఉన్న యువకుల కోసం పల్లె ప్రకృతి వనాల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏ ర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత యు వకులకు కూడా జిమ్‌లు అందుబాటులోకి రావడంతో దేహదారుఢ్యాన్ని పెం చుకోవడానికి ఈ ఓపెన్‌ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రతి ప్రకృతి వనంలో ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుతోపాటు యువతకు మరిన్ని సదుపాయా లు అందుబాటులోకి తెచ్చారు.

చిన్నారుల కోసం ఆట వస్తువులు...

పల్లె ప్రకృతి వనాల్లో కేవలం యువకులు, వృద్ధ్దులు, మహిళాలకే కాకుండా కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్‌ చేసేందుకు ఈ వనాలు ఎంతోగానూ ఉపయోగపడుతున్నాయి. చిన్నారులకు వివిధ రకాల ఆట వస్తువులు ప్రకృతి వనంలో ఏర్పాటు చేయడంతో పిల్లల ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి. చిన్నారులు ఈ వనాల్లో సంతోషంగా కాలం గడుపుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వనా ల్లో ఎన్నో రకాలైన మొక్కల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 

అందుబాటులో ఉండాలనే..

పల్లె ప్రకృతి వనంలో అందరికీ కావలసిన ఆట వస్త్తువులు, జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌ లతోపాటు పలు రకాల పూల మొక్కలను ఏర్పాటు చేశాం. ఈ వనంలోకి వచ్చే కుటుంబ సభ్యులు బాధలు మార్చిపోయి జీవితాన్ని ఆనందగా గడుపాలనే ఉద్దేశంతో పచ్చని చెట్లను ఏర్పాటు చేస్తున్నాం. పనులు పూర్తి చేసిన తర్వాత అందరికీ ఈ వనంలోకి అనుమతిస్తాం.

- గోవర్ధన్‌, సర్పంచ్‌, మరికల్‌

గ్రామాల్లో పనులు పూర్తి..

అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లు పూర్తి స్థాయికి వచ్చాయి. మండల కేంద్రంలో ఓపెన్‌ జిమ్‌ పరికరాలతోపాటు, చిన్నారుల ఆట వస్త్తువులు ఏర్పాటు చేశాం. 4 వేల మొక్కలు నాటాం. అయితే తీలేరులో స్థల వివాదం కారణంగా పనులు ప్రారంభం కాలేదు, పెద్ద చింతకుంటలో ప్రస్త్తుతం పనులు కొనసాగుతున్నాయి. ప్రకృతి వనాలతో పల్లెలకు నూతన శోభ వస్తున్నది.

- యశోదమ్మ, ఎంపీడీవో


VIDEOS

logo