ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 29, 2021 , 01:37:55

లబ్ధిదారుల నివేదికలు తయారు చేయాలి

లబ్ధిదారుల నివేదికలు తయారు చేయాలి

  •  ఢిల్లీ బృందం సభ్యులు

నారాయణపేట, జనవరి 28: జిల్లాలో 65 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు నేషనల్‌ పెన్షన్‌ స్కీం కింద అర్హులైన లబ్ధిదారుల వివరాలతో నివేదిక తయారు చేయాలని నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాం ఢిల్లీ బృందం సభ్యులు కల్పనా సక్సేనా, ప్రమోద్‌సింగ్‌ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలవుతున్న ఆసరా పింఛన్ల అమలు తీరును శుక్రవారం నుంచి ఫిబ్రవరి 2వరకు పరిశీలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సభ్యులు డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పురుషోత్తం, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌  సత్యనారాయణ, ఏపీవో శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ పీడీ నాగేందర్‌, డీఆర్డీవో కాళిందిని, అడిషనల్‌ పీడీ సత్యనారాయణ, నోడల్‌ అధికారి రహమత్‌, డీపీఎం ఆనందం పాల్గొన్నారు. 


VIDEOS

logo