మహిళా మేలుకో

- ఆర్థిక స్వావలంబన సాధించేందుకు శ్రీకారం..
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ప్రాధాన్యం
- నారాయణపేట జిల్లా లక్ష్యం 4,013..
- ఇప్పటివరకు 1,622 నూతన మహిళా సంఘాల ఏర్పాటు
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తున్నది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అర్హత ఉన్న ప్రతి మహిళనూ సంఘంలో చేర్చాలని నిర్ణయించింది. మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నది. ఈ మేరకు వీవోఏలు ఇంటింటికీ తిరుగుతూ 18 నుంచి 58 ఏండ్లలోపు అర్హులైన మహిళలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
నారాయణపేట టౌన్, జనవరి 28 : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ను చేపడుతున్నది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అర్హత ఉన్న ప్రతి మహిళనూ సంఘం లో చేర్చాలని భావించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పా టు చేయడంతోపాటు బ్యాంకుల ద్వారా రుణాలను అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే సంఘాల్లో ఉన్న మహిళలు రుణాలు పొంది ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. ఒక్కో గ్రూపున కు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశా ల మేరకు కొత్త సంఘాల ఏర్పాటుకు సెర్ప్ అధికారులు కృషి చేస్తున్నారు. నారాయణపేట జి ల్లాలో డిసెంబర్ 20వ తేదీ నుంచి అర్హుల గు ర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తో క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అ వగాహన కల్పిస్తున్నారు. వీవోఏలు సంఘం అ ధ్యక్షురాలితో కలిసి ఓటర్ల జాబితా ప్రకారం 18 నుంచి 58 ఏండ్లలోపు ఉన్న మహిళల ఇంటింటికీ తిరుగుతూ గుర్తించడంతోపాటు ప్రయోజనాలను వివరిస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పెండ్లి కాని, ఉద్యోగం చేస్తున్న వారిని, ఉద్యోగస్తుల భార్యలను సంఘంలో చేర్చుకోరు. ఒక్కో సంఘంలో 10 మంది సభ్యుల చొప్పున ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. పాత సంఘాల్లో పలు కారణాలతో ఏర్పడిన ఖాళీలను కొత్త వారితో భర్తీ చేస్తున్నారు. సంఘాలు ఏర్పాటయ్యాక బ్యాంకు ఖాతా తెరుస్తున్నారు.
40 శాతం పూర్తి..
జిల్లాలో ఇప్పటికే 7,500 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 82 వేల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే జి ల్లాలో నూతనంగా 40 వేల మందితో 4,013 సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులకు లక్ష్యం విధించారు. అయితే, ఇందులో ఇప్పటివరకు 16,623 మంది మహిళలతో 1,622 సంఘాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 40 శాతం పూర్తి చేశారు. 193 ఆన్లైన్ చే యగా, 240 సంఘాలచే బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించారు. నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో నూతన సంఘాల ఏర్పాటులో మాగనూర్ మండలం మొదటి స్థానంలో ఉండగా, మద్దూర్ చివరి స్థానంలో ఉన్నది.
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్