శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 28, 2021 , 00:10:17

ముగిసిన యూపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ

ముగిసిన యూపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ

ఊట్కూర్‌, జనవరి 27 : మండల కేంద్రంలో అంబేద్కర్‌ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యూపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో రాయల్‌ ైస్టెకర్స్‌ జట్టు ప్రథమ బహుమతి గెలుచుకున్నది. రన్నరప్‌గా పాండ్య ఫైటర్స్‌ జట్టు నిలిచింది.. విజేతలకు బుధవారం  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వర్కటం జగన్నాథ్‌రెడ్డి ప్రథమ బహుమతిగా రూ. 25 వేల చెక్కును, ఎంఐఎం మండల నాయకుడు అబ్దుల్‌ మునీర్‌ ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు చెక్కులను అందించి అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ ఇబాదుల్‌ రహెమాన్‌, వార్డు సభ్యుడు అశోక్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట్‌నాయక్‌, నిర్వాహకులు దశరథ్‌, తిమ్మప్ప, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo