కోస్గిలో ఉద్రిక్తత

- కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
- బహిరంగ చర్చకు అనుమతిలేదని పోలీసుల నిరాకరణ
కోస్గి జనవరి27: కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో కాదు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాకే జరిగిందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్,టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ చేసుకోవడంతో పోలీసులు చర్చకు అనుమతిలేదని మొదట కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. తాము చర్చకు సిద్ధమంటూ టీఆర్ఎస్ నాయకులు సైతం శివాజీ కూడలికి చేరుకోవడంతో పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఉట్టిమాటలు, జిమ్మిక్కులు మాని అభివృద్ధికి సహకరించాలని టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ‘మీ నాయకుడు అభివృద్ధి చేయనందుకే కొడంగల్ ప్రజలు ఓడించారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి’ అంటూ పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, కౌన్సిలర్లు బాలేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!