సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Jan 27, 2021 , 00:15:57

జీఎస్టీతో వ్యాపారుల కష్టాలు తీరాయి

జీఎస్టీతో వ్యాపారుల కష్టాలు తీరాయి

  • కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ మండలాధ్యక్షుడు రఘుప్రసన్న భట్‌

మక్తల్‌ రూరల్‌, జనవరి 26 : జీఎస్టీ అమలు చేసిన తర్వాత వ్యాపారుల కష్టాలు తీరాయని కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ మండలాధ్యక్షుడు రఘుప్రసన్న భట్‌ తెలిపారు. పట్టణంలోని కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవ ర్గ సమావేశంలో మంగళవారం నూతన అధ్యక్షుడిగా రఘుప్రసన్న భట్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని తీసుకోచ్చిన తర్వాత వ్యాపారులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. దాదాపు 90 శాతం జీఎస్టీ బి ల్లులతోనే సరుకుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. వ్యాపార లావాదేవీల్లో మ రింత పారదర్శకతతో ఎవరికి వారు తమ వృత్తులను కొనసాగిస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం రఘుప్రసన్న భట్‌ను వ్యాపారులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో కిరాణ, జనరల్‌ సంఘం గౌరవ అధ్యక్షుడు నూర్‌పాషా, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి నరేశ్‌, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, సురేశ్‌, విజయ్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి హరికృష్ణ పాల్గొన్నారు. 


VIDEOS

logo