సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 27, 2021 , 00:16:28

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  • ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

నారాయణపేట, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లాలో మంగళవారం మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సేవా కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్‌ - 19  నిబంధనలు అనుసరించి ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ జెండా పండుగను జరుపుకొన్నారు. ప్రతిఒక్కరూ దేశ ఔనత్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని పలువురు సూచించారు. పట్టణంలోని పరేడ్‌ మైదానంలో వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజమ్మ, కలెక్టర్‌ హరిచందన, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఎస్పీ చేతన ఆయా స్టాళ్లలో ఏర్పాటు చేసిన వస్తువులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది అధికారులు, సిబ్బంది, ఆయా శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 68 మందికి జెడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వారిని అభినందించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


VIDEOS

logo