Narayanpet
- Jan 27, 2021 , 00:15:28
VIDEOS
జిల్లా మహోన్నతికి కంకణబద్ధులు కావాలి

- నారాయణపేట కలెక్టర్ హరిచందన
- పరేడ్ మైదానంలో జెండావిష్కరణ
నారాయణపేట, జనవరి 26 : జిల్లా మహోన్నతి కి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముం దుకు సాగుతుందన్నారు. 72వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని నా రాయణపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎస్పీ చేతనలతో కలిసి కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎరగవేశారు. కలెక్టర్, ఎస్పీలు పోలీసుల గౌరవ వందనం స్వీకరించా రు. అనంతరం జిల్లాలో చేపట్టిన ప్రగతి నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు.
- జిల్లాలో 96,834 మందిని రైతుబీమాకు అర్హులుగా గుర్తించామని, 1,460 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.66.23 కోట్లు నామి నీ ఖాతాల్లో జమచేశామని కలెక్టర్ చెప్పారు. రైతుబంధు కింద యాసంగిలో 1,47,865 మంది రైతు ల ఖాతాల్లో రూ.221.31 కోట్లు జమచేశామన్నారు.
- పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో క్రిమిటోరియం, డంపింగ్ యార్డులు, రైతుకల్లాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 77 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు.
- 5,301 మహిళా స్వయం సహాయక సం ఘాలకు రూ.113.86 కోట్ల రుణాలను మంజూరు చేశామన్నారు. మక్తల్లో హెర్బల్ ప్రొడక్ట్స్, మాగనూర్లో హైజీన్ ప్రొడక్ట్స్, పేటలో వెదురు ఉత్పత్తులు, చేనేత చీరలు, డోర్ డెకరేషన్స్, పచ్చళ్లు తదితర ఉత్పత్తుల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. రెండు పబ్లిక్ స్మార్ట్ వాష్రూంలను మహిళా సంఘాల సభ్యులతో నడిపిస్తున్నట్లు వివరించారు. స్త్రీ ల కోసం పట్టణంలో నిరాశ్రయుల కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
- స్వయం ఉపాధి ప థకం ద్వారా 539 మంది షె డ్యూల్డ్ కులాల యువతకు రూ. 909.75 లక్షలు కేటాయించామన్నా రు. 2020-21 యాక్షన్ ప్లాన్ కింద జి ల్లాకు 150 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. టీఆర్ఐసీవోఆర్ పథకం కింద 105 మంది షెడ్యూల్డ్ తెగల యువతకు రూ.1.25 కోట్ల సబ్సిడీ మంజూరు చేశామని పేర్కొన్నారు.
- 2020-21 సంవత్సరానికి గానూ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా 2,707 మంది లబ్ధిదారులకు రూ.26.68 కోట్లు అందించామని కలెక్టర్ పేర్కొన్నారు.
- పేట మున్సిపాలిటీలోని బోర్డ్ ఆఫ్ ఖాదీ ఇం డియా ద్వారా 20 మంది కుమ్మరి వృత్తిదారులకు విద్యుత్ సారెలను పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీ వో శ్రీనివాసులు, నాయకులు, అధికారులు ఉన్నారు.
తాజావార్తలు
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
- రూ.5.85 లక్షల కోట్ల రుణాల రద్దు!
MOST READ
TRENDING