ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 26, 2021 , 02:19:28

ప్రారంభమైన రెండో విడుత టీకా

ప్రారంభమైన రెండో విడుత టీకా

  • ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌
  • పర్యవేక్షించిన జిల్లా అధికారులు

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ/గద్వాల టౌన్‌/నారాయణపేట టౌన్‌/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/వనపర్తి, జనవరి 25 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. సోమవారం ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్య సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,293 మందికి టీకా వేశారు.

  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొదటిరోజు 880 మందికి గానూ 714 మందికి టీకా వేశారు. జిల్లాలోని 17 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. డీఎంహెచ్‌వో కృష్ణ, ఇమ్యూనైజేషన్‌ జిల్లా అధికారి డాక్టర్‌ శంకర్‌ టీకా ప్రక్రియను పర్యవేక్షించారు. 
  • జోగుళాంబ గద్వాల జిల్లాలో 33 ప్రైవేట్‌ దవాఖానలుండగా, 252 మంది సేవలందిస్తున్నారు. ఇందులో వ్యాక్సిన్‌ కోసం 162 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వ్యాక్సినేషన్‌కుగానూ జిల్లా దవాఖానలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం 72 మందికి వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్రమాన్ని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో చందూనాయక్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ శోభారాణి, డీఐవో డాక్టర్‌ సౌజన్య పర్యవేక్షించారు. 
  • నారాయణపేట జిల్లాలో 177 మంది కొవిడ్‌ టీకా వేశారు. జిల్లా దవాఖానలో 60, మక్తల్‌ సీహెచ్‌సీలో 59, కోస్గి సీహెచ్‌సీలో 58 మందికి వ్యాక్సిన్‌ వేశారు. జిల్లా దవాఖానలో వ్యాక్సినేషన్‌ను డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌ పరిశీలించారు. 
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఐదు కేంద్రాల ద్వారా 472 మందికి టీకా వేసేందుకు గుర్తించగా మొదటిరోజు 187 మందికి వ్యాక్సిన్‌ వేశారు. 
  • వనపర్తి జిల్లాలో ఐదు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టినట్లు డీఎంహెచ్‌వో శ్రీనివాసులు తెలిపారు. 393 మందికి టీకాలు వేయాల్సి ఉండగా 143 మందికి వేశామని, మిగిలిన 250 మందికి వివిధ కారణాలతో టీకా వేయలేదన్నారు. 

VIDEOS

logo