గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 26, 2021 , 02:14:35

ఓటు హ క్కును వినియోగించుకోవాలి

ఓటు  హ క్కును వినియోగించుకోవాలి

నారాయణపేట టౌన్‌, జనవరి 25 : వయోజనులై న ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడ మే కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు విధిగా ఓటు హ క్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ హరిచందన పి లుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భం గా కళాశాల విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో కలి సి కలెక్టరేట్‌ నుంచి మినీ స్టేడియం వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భం గా మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఓటరుగా నమోదు చేసుకోని వా రు ఆర్డీవో, తాసిల్దార్‌ కార్యాలయాలు, వార్డులకు కేటాయించిన బీఎల్‌వోల ద్వారా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా 900 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొత్త ఓ టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ‘ఓటు ప్రాముఖ్యత’పై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా అధికారు లు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ప్రతి వ్యక్తి అవగాహన కలిగి ఉండాలి

కృష్ణ, జనవరి 25 : ప్రతి వ్యక్తి ఓటు హ క్కుపై అవగాహన కలిగి ఉండాలని, ఓటు హక్కుతోనే దేశ అభివృద్ధిని నిర్ణయించవచ్చని తాసిల్దార్‌ సురేశ్‌ అన్నారు. మండల ంలోని తాసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో జాతీయ ఓ టరు దినోత్సవం సందర్భంగా తాసిల్దార్‌ ప్రజాప్రతినిధులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమపాటిల్‌, జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్‌, నాయ కులు పాల్గొన్నారు. 

ఓటుతో రాజ్యాంగ పరిరక్షణ

నర్వ, జనవరి 25 : ఓటు హక్కుతో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు పరిరక్షింపబడుతాయని ఎంపీటీ సీ శ్యాంలాల్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, గ్రామ పాలక మండలి సభ్యులు, విద్యార్థుచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, విండో డైరెక్టర్‌ శేఖర్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాము పాల్గొన్నారు.

ఓటు హక్కు మన హక్కు 

మక్తల్‌ టౌన్‌, జనవరి 25 : ఓటు హక్కు మన హ క్కు కలిగి ఉన్నందున మన మందరం గర్విద్దామని తా సిల్దార్‌ నర్సింగ్‌రావు అన్నారు. పట్టణంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

VIDEOS

logo