బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Jan 25, 2021 , 00:31:54

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

  • మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

కృష్ణ, జనవరి 24 : సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం మాగనూర్‌ మండలం నేరడగం గ్రామానికి చెందిన సురేశ్‌కు రూ.20 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు భరోసా కల్పిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయులు పాల్గొన్నారు. 


VIDEOS

logo