గురువారం 04 మార్చి 2021
Narayanpet - Jan 25, 2021 , 00:31:53

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

నారాయణపేట రూరల్‌, జనవరి 24 : బాలికలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు నర్సింహులు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బాల కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సితార వాయిద్యంలో ప్రతిభ కనబర్చిన సువర్ణను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను చిన్నచూపు చూడకుండా మగవారితో సమానంగా చూడాలన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు కతలప్ప, పీఈటీలు పాల్గొ న్నారు.


VIDEOS

logo