బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Jan 24, 2021 , 00:56:42

‘ఆదర్శ పల్లెలుగా తీర్చిదిద్దాలి’

‘ఆదర్శ పల్లెలుగా తీర్చిదిద్దాలి’

నారాయణపేట టౌన్‌, జనవరి 23 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామాలను దేశంలోనే ఆదర్శ పల్లెలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వనజమ్మ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీడీవో సంఘం అధికారుల క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్లే బా ధ్యత ఎంపీడీవోలపై ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కాళిందిని, జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. 


VIDEOS

logo