సమన్వయంతో పని చేయాలి

నారాయణపేట, జనవరి 23 : కోర్టు డ్యూటీ అధికారులు కోర్టు ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బందితో మంచి సమన్వయాన్ని కొనసాగించాలని ఎస్‌హెచ్‌వోలు సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల్లో పోలీస్ సి బ్బంది, కోర్టు డ్యూటీ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వోలు మాట్లాడుతూ వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారందరూ సమన్వయంతో పని చేయాలని, ఎలాం టి సమస్యలు ఎదురైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరిస్తూ నిందితులకు సరైన రీతిలో శిక్షలు పడేలా చేసి సకాలంలో బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్, విచారణలో సమర్థవంగా ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ చేయాలన్నారు.
కోర్టుల్లోని వివిధ అధికారులను సమన్వయపరుస్తూ సాక్షులు, నిందితులను కోర్టులో హాజరు పరచాలన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు న మ్మకం, గౌరవం పెరుగడానికి తమవంతు పాత్రను పోషించాలన్నారు. గత వారంలో కోర్టుల్లో జరిగిన కేసుల్లో పడిన శిక్షలు, వీగిపోయిన కేసుల లోపాలను చర్చించారు.
తాజావార్తలు
- అలవాటైన నడకతో అవార్డుల పంట
- పెట్రోల్ బంకుల్లో కల్తీని సహించం
- పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే .. భారీ మూల్యం తప్పదు!
- ఉత్సాహంగాకదన రంగంలోకి..
- నగర దారులు వాహన బారులు
- పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
- పేదలకు అండగా ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం
- సభ్యత్వ నమోదులో సైనికుడిలా పనిచేయాలి
- సెట్విన్ కేంద్రాల్లో ప్రతిభా పోటీలు