సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Jan 23, 2021 , 00:17:16

ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలు దూరం

ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలు దూరం

నారాయణపేట, జనవరి 22 : అగ్ని ప్రమాదా లు జరుగకుండా ముంద  స్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అ ధికారులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పరే డ్‌ గ్రౌండ్‌లో ఆర్మ్‌డ్‌ రిజ ర్వ్‌ పోలీసులకు అగ్ని ప్ర మాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు ఇంట్లో సిలిండర్‌కు ప్రమాదం జరిగినప్పుడు, మంటలు అంటుకున్నప్పుడు, శ్వాస అందకపోయినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, కాలిన మనుషులను అంబెలెన్స్‌ వద్దకు తీసుకెళ్లే విధానం తదితర అంశాలపై డెమో రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ సిబ్బంది, ఫైర్‌ పోలీసులు పాల్గొన్నారు. 


VIDEOS

logo