శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 22, 2021 , 01:07:58

జింకల పార్కుకు స్థలం పరిశీలించిన డీఎఫ్‌వో

జింకల పార్కుకు స్థలం పరిశీలించిన డీఎఫ్‌వో

నర్వ, జనవరి 21 : జింకల పార్కు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించేందుకు డీఎఫ్‌వో నారాయణరావు గురువారం పాతర్‌చేడ్‌ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జింకలు పెంచేందుకు ఏర్పాటు చేయనున్న పార్కుకు అవసరమయ్యే ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. పండ్లు, పూల మొక్కలతోపాటు టేకు మొక్కలు పెంచాలని ఈజీఏస్‌, పంచాయతీరాజ్‌ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వేయర్‌ రాఘవేందర్‌, సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్యాంలాల్‌, కార్యదర్శి మధు పాల్గొన్నారు.


VIDEOS

logo