సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 21, 2021 , 00:25:13

మాజీ మంత్రి ఎల్లారెడ్డికి ఘన నివాళి

మాజీ మంత్రి ఎల్లారెడ్డికి ఘన నివాళి

ఊట్కూర్‌, జనవరి 20 : దివంగత మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివంగత నేతను స్మరించుకుంటూ కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, పీఏసీసీఎస్‌ మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవిప్రసాద్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

VIDEOS

logo