బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Jan 21, 2021 , 00:25:11

రామ మందిరం ప్రజల సంకల్పం

రామ మందిరం ప్రజల సంకల్పం

  • పశ్చిమాద్రి మఠం పీఠాధిపతి సిద్ధలింగస్వామిజీ     
  • గ్రామాల్లో శోభాయాత్ర, ఆలయాల్లో పూజలు
  • ఇంటింటికీ తిరిగి నిధి సేకరణ 

మక్తల్‌ రూరల్‌, జనవరి 20 : అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ కావడంతో ప్రజల సంకల్పం నెరవేరిందని నేరేడిగొమ్ము పశ్చిమాద్రి మ ఠం పీఠాధిపతి పంచమ సిద్ధలింగస్వామిజీ అన్నారు. బుధవారం అయోధ్యలో రామాలయం నిర్మాణం కో సం నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో వీహెచ్‌పీ, బజరంగదళ్‌ ఆధ్వర్యంలో నల్లజానమ్మ ఆల యం నుంచి పడమటి ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. అంతకు ముందు పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ మా ట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా అయోధ్యలో రాముడి గుడి నిర్మించాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని తెలిపారు. త్వరలోనే భవ్యమైన ఆలయం రూపుదిద్దుకోబోతున్నదన్నారు. ఈ ఆలయం నిర్మాణం కోసం ప్రజలు స్వ చ్ఛందంగా విరాళాలు సమర్పించాలని స్వామిజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిధి సేకరణ సమితి జిల్లా సహాయ సంయోజక్‌ గరిడినింగిరెడ్డి, విశ్వహిందూ పరిషత్‌ ఉ మ్మడి జిల్లా సహాయ కార్యదర్శి భీంరెడ్డి, బీజేపీ వాణి జ్య సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుప్రసన్నభట్‌, కి సాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నిస్వామి, కౌ న్సిలర్లు పాల్గొన్నారు. 

ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

ఊట్కూర్‌, జనవరి 20 : రామ మందిరం నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జనజాగరణ సమితి కమిటీ సభ్యులు కోరారు. మండల కేంద్రంలో నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. ముందుగా రాంనగర్‌ హనుమాన్‌ మందిరంలో పూజలు ని ర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి నిధిని సేకరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రె డ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, సామాజిక సమరసతా కన్వీనర్‌ నర్సింగప్ప, తపస్‌ జిల్లా కా ర్యదర్శి నర్సింహ పాల్గొన్నారు.

ధన రూపంలో సమర్పించుకోవాలి

నారాయణపేట టౌన్‌, జనవరి 20 : మందిరం ని ర్మాణానికి ప్రతిఒక్కరూ మన, ధనరూపంలో సమర్పి ంచుకోవాలని నిధి సేకరణ సభ్యులు, బీజేపీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి ప్రభాకర్‌ వర్ధన్‌, పట్టణ అధ్యక్షులు ర ఘురామయ్యగౌడ్‌, రఘువీర్‌యాదవ్‌ అన్నారు. ప ట్టణంలోని పలు వార్డుల్లో నిధి సేకరణ చేపట్టారు. కా ర్యక్రమంలో నిధి సేకరణ సమితి సభ్యులు వెంకటేశ్‌గౌడ్‌, రవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌, బజరంగ్‌దళ్‌ సభ్యులు పాల్గొన్నారు. 

మందిరం నిర్మాణం కోసం శోభాయాత్ర

మరికల్‌, జనవరి 20 : నూతనంగా నిర్మించనున్న రామ మందిరం నిర్మాణం కోసం మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శో భాయాత్ర నిర్వహించారు. అంతకు ముందు స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి నిధిని సేకరించారు. గ్రామానికి చెందిన దండు రాజవర్ధన్‌రెడ్డి రూ.లక్ష చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు, విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ నాయకులు పాల్గొన్నారు.

జన జాగరణ సమితి ఆధ్వర్యంలో...

దామరగిద్ద, జనవరి 20 : మందిరం నిర్మాణం కో సం నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం నుంచి సంజీవరాయ ఆలయం వర కు భజనలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. వివి ధ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి నిధుల సేకరణ కార్యక్ర మం చేపట్టారు. కార్యక్రమంలో జనజాగరణ సమితి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


VIDEOS

logo