శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 20, 2021 , 00:24:19

టీకాతో కరోనాను తరిమికొడదాం

టీకాతో కరోనాను తరిమికొడదాం

  • కరోనా నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్‌ సిద్ధప్ప 

మక్తల్‌ రూరల్‌, జనవరి 19 : కొవిడ్‌-19 టీకాతో మహమ్మారిని తరిమికొడదామని కరోనా నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్‌ సిద్ధప్ప తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అంగన్‌వాడీ వ ర్కర్లకు కరోనా టీకాలు వేశారు. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 73 మందికి టీకాలు వేసినట్లు ఆయన చెప్పారు. కాగా అంగన్‌వాడీ కార్యకర్తల్లో కొంత మంది గర్భిణులకు టీకాలు వేయలేదన్నారు. అటువంటి వా రికి అధికారుల ఆదేశాల మేరకు తర్వాత టీకాలు వేస్తామన్నారు. టీకా తీసుకున్న వారు భయపడాల్సిన అవ సరం లేదన్నారు. టీకాలు వేసుకోవడానికి కొందరు భయపడుతున్నార ని, అందులో ఎలాంటి ఆందోళన  చెందాల్సిన పని లేదన్నారు. టీకా వి షయంలో అపోహలు పెట్టుకోరాదన్నారు. అదేవిధంగా ఊట్కూర్‌ పీ హెచ్‌సీలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి పాల్గొని కరోనా టీకా కేం ద్రాన్ని ప్రారంభించారు.

‘విడుతల వారీగా వేస్తాం’

దామరగిద్ద, జనవరి 19 : కరోనా వ్యాక్సిన్‌ టీకా విడుతల వారీగా వేస్తామని నారాయణపేట మార్కెట్‌ చైర్‌పర్సన్‌ భాస్కర్‌కుమారి అన్నారు. మండల కేంద్రంలో కరోనా వ్యా క్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖాన వైద్యులు, సిబ్బంది, ఆశ వర్కర్లు దాదాపు 90 మందికి వ్యాక్సిన్‌ వేశామని డాక్టర్‌ రవీందర్‌ తెలిపారు. విడుతల వారీగా ప్రభుత్వ ఆదేశానుసా రం మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్‌ ఎం పీపీ దామోదర్‌రెడ్డి, ఎంపీడీవో, మండల నాయకులు పాల్గొన్నారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ధన్వాడ, జనవరి 19 : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జెడ్పీటీ సీ విమల ప్రారంభించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ వేశారు. మొదటి టీకా ను కొండాపూర్‌ ఏఎన్‌ఎం వరలక్ష్మికి వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అమరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు, డాక్ట ర్‌ వెంకట్‌దాస్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo