ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం

- ఎస్పీ డాక్టర్ చేతన
నారాయణపేట, జనవరి 19 : ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడంతోపాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ చేతన అన్నా రు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్, ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి రోడ్డు ప్రమాదాలు, వాహన చట్టాల గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూ చించారు. వాహనాలు నడిపే వారు రోడ్డు నిబంధనలను పాటించాలన్నారు. మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని ఆమె తెలిపా రు. ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని, లేనిచో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.