సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 20, 2021 , 00:23:57

నూతన చట్టానికి అనుగుణంగా పరిష్కరించాలి

నూతన చట్టానికి అనుగుణంగా పరిష్కరించాలి

నారాయణపేట టౌన్‌, జనవరి 19 : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ తగాదాల ను నూతన రెవెన్యూ చట్టానికి అనుగుణంగా పరిష్కరించాలనిని కలెక్టర్‌ హరిచంద న అన్నారు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో నూతన రెవెన్యూ చట్టంపై న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన చట్టాన్ని అధ్యయనం చేయడంతో భూ తగాదాల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు. 

జిల్లాలో 377 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కలెక్టరేట్‌లో వారంలో ఒకరోజు ప్రత్యేక ట్రిబ్యూనల్‌ ద్వారా పెండింగ్‌ భూ తగాదాలపై వాదనలు, ప్రతివాదనలు ఉంటాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఏవో ఖలీద్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యు లు పాల్గొన్నారు. 


VIDEOS

logo