ప్రమాద రహిత జిల్లాగా మార్చాలి : ఎస్పీ చేతన

నారాయణపేట, జనవరి 18 : జిల్లాను ప్రమాద రహిత, సురక్షిత జిల్లాగా మార్చడానికి ప్రతిఒక్కరూ రోడ్డు ప్రయాణ నిబంధనలు పాటించాలని ఎస్పీ డాక్టర్ చేతన సూచించారు. సోమవా రం పట్టణంలోని శీలా గార్డెన్లో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నిర్వహించనున్న) జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మానవుడు కాలానికి అనుగుణంగా అనేక ర కాల వాహనాలను తయారు చేసి వాడుతున్నాడని, తగిన నియ మ నిబంధనలు పాటించి వాహనాలను వాడినప్పుడే ప్రమాదాలు జరుగకుండా ఉంటాయన్నారు. వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, పరిమిత వేగంతో వాహనాలు నడిపించాలని సూచించారు. రహదారి మాసోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నియంత్రణ, నిబంధనలపై వాల్ పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి వీరస్వామి, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, ఆటో, కార్ డ్రైవర్లు, వి ద్యార్థులు పాల్గొన్నారు.
డయల్ 100కు సమాచారం ఇవ్వాలి
అత్యవసర సమయంలో ప్రజలు డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల దినం సందర్భంగా ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సీఐలు, ఎస్సైలను ఆదేశించారు.
తాజావార్తలు
- అంబానీ గ్యారేజీకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్బ్యాడ్జ్
- మ్యాప్‌మైఇండియా మ్యాప్స్ లో కరోనా టీకా కేంద్రాల సమాచారం
- సుపరిపాలన కోసం క్రిప్టో కరెన్సీ:అనురాగ్ ఠాకూర్
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్‌గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?