గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 19, 2021 , 02:14:09

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై భయం వద్దు

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై భయం వద్దు

  • జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు

గోపాల్‌పేట, జనవరి 18 : కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు అన్నారు.  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా వైద్య సిబ్బంది, ఆశలకు  మొత్తం 52 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ఎలాంటి భయాందోళనలు చెందొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బంది, ఆశకార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి మంజుల, శ్రావణి, ఎంపీడీవో కరుణశ్రీ, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, వైద్య సిబ్బంది సురేశ్‌కుమార్‌, మధుబాబు, నాగమణి, విజయలత, వెంకటమ్మ, లక్ష్మీకాంతరెడ్డి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగిన కొవిడ్‌ వ్యాక్సిన్‌

వనపర్తి గాంధీచౌక్‌, జనవరి 18 : జిల్లా దవాఖానలో సోమవారం 30 మందికి గానూ 29 మంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అలాగే ఆత్మకూర్‌ పీహెచ్‌సీలో 48 మంది, ఘణపురంలో 40మంది, గోపాల్‌పేట పీహెచ్‌సీలో 52 మందికి, వీపనగండ్ల పీహెచ్‌సీలో 38 మంది వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీశ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ చైతన్యగౌడ్‌ పర్యవేక్షించారు. 

ఆత్మకూరులో..

ఆత్మకూరు, జనవరి 18 : ఆత్మకూరు సర్కారు దవాఖానలో డీఐవో సౌభాగ్యలక్ష్మి నేతృత్వంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సోమవారం విజయవంతమైంది. ఆత్మకూరు సివిల్‌ దవాఖాన, తిప్డంపల్లి పీహెచ్‌సీలకు చెందిన 40మంది హెల్త్‌కేర్‌ సిబ్బందికి రెండో రోజు వ్యాక్సిన్‌ వేశారు. తిప్డంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నుంచి వ్యాక్సినేషన్‌ సేవలు ప్రారంభమవుతాయని వైద్యాధికారి లక్ష్మణ్‌ తెలిపారు. 

VIDEOS

logo