బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Jan 18, 2021 , 00:57:16

వెంకయ్య సేవలు మరువలేనివి

వెంకయ్య సేవలు మరువలేనివి

  • ఎమ్మెల్యే చిట్టెం

ధన్వాడ, జనవరి 17 : మండల మాజీ ఎంపీపీ దివంగత వెంకయ్య సేవలు మరువలేనివని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన వెంకయ్య సంతాప సభలో ఎమ్మెల్యేతోపా టు మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వెంకయ్య ఏసీపీగా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రా జకీయాలకు వచ్చి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా గురుకుల పాఠశాల ధన్వాడలో ఏర్పాటుకు కృషి చేశారన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి పనుల కు గ్రామంలోని నాయకులు పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం లో డాక్టర్‌ జె.రామ్మోహన్‌, మాజీ వైస్‌ ఎంపీ పీ రామచంద్రయ్య, ఎంపీటీసీ ఉమేశ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


VIDEOS

logo