పేటలో ఉద్రిక్తత వాతావరణం

- టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం
- ఇరు పార్టీల నేతల ముందస్తు అరెస్టు
- సొంత పూచీకత్తపై విడుదల
నారాయణపేట, జనవరి 16 : నారాయణపేటలో బీజేపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అందుకు ఆధారాలతో సహా రుజువు చేస్తామని టీఆర్ఎస్ నాయకు లు, ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని బీజేపీ నాయకులు వారం రోజులుగా పత్రిక విలేకరుల సమావేశాలతోపాటు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో చలో చౌక్‌బజార్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 8 గంటలకు టీఆర్ఎస్ నాయకులు, 9 గంటల కు బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతోపాటు అదే వేదికపై చ ర్చించుకుందామని సవాల్, ప్రతి సవాల్ చేసుకున్నా రు. దీంతో పేటలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఇది గమనించిన పోలీసులు శాంతి భద్రతల సమస్యలు వాటిల్లుతాయనే ఉద్దేశంతో ఇరు పా ర్టీల నాయకుల ముందుస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం తెల్లవారుజామున నుంచే ఇరు పార్టీల ముఖ్య నాయకుల ఇండ్ల వద్దకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకోని నారాయణపేట పోలీస్‌స్టేషన్ కు టీఆర్ఎస్ నాయకులు, దామరగిద్ద పోలీస్‌స్టేషన్ కు బీజేపీ నాయకులను తరలించారు. అయినప్పటికీ ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొంత మంది పోలీసుల కళ్లుగప్పి చౌక్‌బజార్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత సొంత పూచీకత్తుపై ఇరు పార్టీల నాయకులను వదిలిపెట్టారు.
తాజావార్తలు
- కోవిడ్ టీకా తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- మూతపడిన కరాచీ బేకరీ
- శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేష్
- ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: వాణీదేవి
- డీఎంకేతో పొసగని కాంగ్రెస్ పొత్తు.. కూటమిలో కొనసాగేనా?
- లంచ్ టైమ్.. ఇంగ్లండ్ 74/3
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్‌లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి