ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 17, 2021 , 00:39:11

అందరి కృషితోనే కరోనా నియంత్రణ

అందరి కృషితోనే కరోనా నియంత్రణ

  • పేటలో టీకా కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే 

నారాయణపేట, జనవరి 16 : వైద్య, పోలీసు, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది, ప్రజల కృషితోనే కరోనా ని యంత్రణ సాధ్యమైందని జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పేట జిల్లా దవాఖానలో కొవిడ్‌ టీకా కేంద్రాన్ని వారు కలెక్టర్‌ హరిచందనతో కలిసి కలిసి ప్రారంభించారు. మొదటి టీకాను ఆశవర్కర్‌ శ్రీదేవికి, రెండో టీకాను భాగ్యమ్మకు ఇవ్వగా, ఎమ్మెల్యే, కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒకేసారి పెద్ద మొత్తంలో టీకా పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. కొవిడ్‌ టీకా చాలా సురక్షితమైందన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా టీకా వేసుకొని, సాధార ణ జీవనం కొనసాగించాలని కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని మూడు కేంద్రాల్లో 30 మంది చొప్పున 90 మందికి టీకా వేశామన్నారు. మొదటి విడుతలో జిల్లాకు 1,040 వాయిల్స్‌ వచ్చాయని, వీటిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఇస్తామన్నారు. సోమవారం నుంచి 12 కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పా రు. అలాగే మరికల్‌ పీహెచ్‌సీలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సురేఖరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్‌, ఎంపీపీ శ్రీకళ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మొదటి టీకాను ఏఎన్‌ఎం స్వరూప కు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డా.మల్లికార్జున్‌, ప్రత్యే క అధికారి జైపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ అం జలి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వైద్య సిబ్బంది ఉ న్నారు.

VIDEOS

logo